SRPT: యూనియన్ బ్యాంక్ సీఎస్సీ నిర్వాహకుడు సామ లింగారెడ్డి శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. గత ఆరేళ్లుగా యూనియన్ బ్యాంక్ సీఎస్సీ సెంటర్‌తో పాటు ఆన్లైన్ సేవలను నిర్వహిస్తూ వినియోగదారులకు, రైతులకు, వృద్ధులకు సేవలందించారు. లింగారెడ్డి మృతితో నూతనకల్తో పాటు పరిసర గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.