BDK: జిల్లా స్థాయి అండర్ 16 కబడ్డీ సెలక్షన్ పోటీలు పురుషులు మహిళలకు కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు కబడ్డీ ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు.