NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాల వద్ద ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను నగర కార్యదర్శి యజ్ఞ భరత్ ఆవిష్కరించారు. జనవరి 3 నుంచి 5 వరకు శంషాబాద్లో జరిగే ఈ సభలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.