జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌కు చెందిన బాలే దివ్య గురువారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బాలె లక్ష్మణ్-పద్మల కుమార్తె దివ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, జీవితంపై విరక్తి చెంది, గ్రామ పొలిమేరలోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు.