KNR: కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్లో మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో హాజరయ్యారు.