ADB: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమానికి MP నగేష్, MLA శంకర్‌తో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘన నివాళులర్పించారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.