NRPT: కోస్గి పట్టణంలో శుక్రవారం బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన గొల్ల హన్మమ్మ (60) బస్ స్టేషన్లోకి వెళ్తుండగా, అదే మార్గంలో వచ్చిన బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.