BDK: మణుగూరు మండలం ఇసుక ర్యాంకులో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలింపులో నకిలీ డీడీలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అశ్వాపురంలో ఒక లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇసుక రాంప్ నిర్వహణపై ఇంటిలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.