KMR: మద్నూర్‌లో రేపు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి, చెవి, ముక్కు ,గొంతు సంబంధిత వ్యాధులకు ఈ క్యాంపులో ప్రత్యేక వైద్యం అందించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శనివారం విలేకరులకు తెలిపారు.