JN: లింగాల గణపురం మండలంలోని జీడికల్ రామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ నిర్వహించిన తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీడికల్ రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.