HYD: రాష్ట్రంలోనే అతిపెద్ద పూల మార్కెట్‌గా పేరొందిన గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వ్యాపారులకు స్థలం సరిపోటం లేదు. దీంతో కొనుగోలుదారులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌కు సుమారు రూ. 2.79 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వం దృష్టి పెట్టి, మార్కెట్‌ను విస్తరించాలని వ్యాపారస్థులు కోరుతున్నారు.