MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి మెగా OCPలో బొగ్గు రవాణా చేయడంలో స్థానికులకు అవకాశం కల్పించాలని తాండూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. MPO అనిల్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. త్వరలో ప్రారంభం కానున్న అబ్బాపూర్, గోలేటి, మాదారం మెగా ఓపెన్ కాస్ట్ ద్వారా వెలికి తీసే బొగ్గు రవాణాను స్థానిక లారీలకు పని కల్పించే విధంగా సౌకర్యం కల్పించాలన్నారు.