GDWL: వడ్డేపల్లి మున్సిపల్ ఛైర్మన్ మంజుల మంగళవారం జమ్మిచేడు సమీపంలోని జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో పురేందర్ కుమార్ ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.