NZB: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి సందర్భంగా శనివారం గంగాస్థాన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఉదయం 6 గంటలకు పంచామృతాలతో అభిషేకం జరగనుందని ఆలయ అర్చకులు సంతోష్ శర్మ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందిస్తామన్నారు.