NLG: నార్కెట్పల్లి మండలం ఎం. యెడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నైబాయిలో హనుమద్గాయత్రీ హోమం కార్యక్రమాలు మంగళవారం వైభవంగా జరిగాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు ముందుగా స్వాగతం పలికి సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.