GDL: భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండలం వావిలాలలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారంకోసం ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్లేవారని, ఇప్పుడు అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు.