GDL: విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి లోకం ఐక్యంగా ముందుకు సాగాలని పీడీఎస్యూ గద్వాల జిల్లా అధ్యక్షుడు హలీం పాషా పిలుపునిచ్చారు. వరంగల్లో జనవరి 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న 23 వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను అయిజలో శనివారం ఆవిష్కరించారు. ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.