HYD: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(MCC)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద ఉపఎన్నికల ప్రచారం చేస్తున్న BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు అక్షర, కార్పొరేటర్ రాజ్ కుమార్తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. పార్టీ కండువాలు వేసుకుని వెంకటగిరిలోని ప్రార్థన మందిరం వద్ద కరపత్రాలతో ప్రార్థనలు చేసి వచ్చిన వారిని ప్రభావితం చేయగా.. కేసు నమోదైంది.