HYD: అల్వాల్ నగరాన్ని కాలుష్య రహిత పచ్చదనం ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విశ్వ స్వచ్చంద, విశ్వ వ్యర్థరహిత సంస్థ ఆధ్వర్యంలో లోతుకుంటలోని ఇందిరానగర్ కాలనీ సామాజిక భవనంలో శనివారం ఉదయం అవగాహన సదస్సు జరగనుంది. నేల, గాలి, నీరు కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువులపై ప్రదర్శన చేయనున్నట్లు పేర్కొన్నారు.