MNCL: బీసీలకు మేలు చేసే 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని CPM జన్నారం మండల కార్యదర్శి కే.లింగన్న, ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బీసీ బిల్లు ఆమోదించాలని, సీపీఎం నాయకుల అరెస్టును ఖండిస్తూ గురువారం జన్నారంలోని ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు ఆందోళన చేశారు.