MBNR: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 603 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర మురుగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిలో ఇది మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.