MNCL: జన్నారం మండలంలోని చింతగూడ, మొహమదాబాద్ అటవీ ప్రాంతాలలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం చింతగూడా అటవీ ప్రాంతంలో పెద్దపులి అరుపులు, మహమ్మదాబాద్ అటవీ ప్రాంతంలో పాదముద్రలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.