MBNR: జిల్లాలోని జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్, అడ్డాకల్, మూసాపేట్ మండలాల్లో గ్రామ పంచాయతీ తుది విడత ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ఐదు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీలకు 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1249 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.