మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి జండా ఆవిష్కరణ చేసి, తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఒక కీలకమైన రోజు అని, శతాబ్దాల బానిస సంకెళ్లను తెంచుకున్న క్షణం అని అన్నారు.