KNR: విద్యార్థులు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బాల బాలికలు నిత్యం చదువుపైనే ధ్యాస పెట్టాలనీ, అనవసర విషయాలను పట్టించుకోవద్దనీ సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.