SGR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అర్జీదారులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలు విన్న ఆయన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.