WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సెలవుల్లో వినోదం కోసం చెరువులు, వాగులు, కుంటల్లో ఈతకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. గతంలో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని కోరారు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కోచింగ్ పంపాలన్నారు.