ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆసిఫాబాద్, కెరమెరిలో 45.1 డిగ్రీలు నమోదు కాగా దహెగాంలో 44.8, సిర్పూర్ 44.5, వాంకిడి 44.0, రెబ్బెన 43.7, పెంచికల్ పేట్ 43.5, కాగజ్ నగర్ 43.0, తిర్యాణిలో 42.2 డిగ్రీలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.