HYD: అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. ఏ క్షణమైనా అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.