NZB: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని రూరల్ టౌన్ ఎన్ఎచ్వో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఊళ్లోకి వెళ్లేవారు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టరాదని, డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.