NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్ష గురువారం 22వ రోజుకు చేరింది. దీంతో అక్కడి రైతులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారంతో ధ్రువీకరణ పత్రాలు పొంది ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని తరలించాలని కోరారు.