KNR: హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న అని ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, యువత, విద్యావేత్తలు తదితరుల పాల్లొన్నారు.