మంచిర్యాల: లక్షెట్టిపేట మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్నుల అసలుపై వేసిన వడ్డీ విషయంలో ఇచ్చే రాయితీని పట్టణ ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి కట్టని పన్నులపై వడ్డీ వేయడం జరుగుతుందన్నారు. ఆ వడ్డీ విషయంలో 90 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు.