MNCL: ఈ నెల 27 నుండి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులు బయలు దేరుతున్న బస్సులను గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కప్- 2024 రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని అన్నారు.