SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనులు మరింత వేగవంతంగా చేపట్టాలని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా, దర్శన సౌకర్యాలు, మౌలిక వసతులు పకడ్బందీగా కల్పించాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.