MBNR: జిల్లా కేంద్రంలోని మాడ్రన్ హై స్కూల్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలో శుక్రవారం నిర్వహిస్తున్న ఎస్-1 పరీక్షలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలను ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు.