GDWL: విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ఏ అవసరానికైనా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే నరకం కనిపిస్తోందని పెద్దధన్వాడ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడుతో కలిసి గ్రామ యువత, రైతులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషను కలిసి తమ సమస్యలను విన్నవించారు. సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నామన్నారు.