SDPT: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం చేసినట్లు తెలిపారు.