NLG: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఖండించారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక అరాచకాన్ని సృష్టిస్తూ వస్తున్నారని ఆరోపించారు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు.