SDPT: వర్గల్ శ్రీ శారద స్మార్త వేద విద్యాలయ పూర్వ విద్యార్థి శివరామకృష్ణ యజుర్వేద వేద విద్యలో ప్రతిభ చాటి కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా మూలపాటి పట్టాను అందుకున్నారు. ములుగు మండలం వంటిమామిడికి చెందిన ఉప్పల అనంతగిరిశర్మ, శ్వేత దంపతుల కుమారుడైన శివరామకృష్ణ పట్టా పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.