NZB: రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు శనివారం NZB జిల్లా విద్యార్థులు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని SMP ఇంటర్నేషనల్ స్కూల్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డీవైఎస్వో పవన్ కుమార్ ధ్రువపత్రాలు ప్రదానం చేసి, అభినందనలు తెలిపారు.