VKB: దుద్యాల మండల నూతన MPDOగా జైపాల్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ అయిన మహేష్ కుమార్, నూతన MPDO జైపాల్ రెడ్డిలను పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో MPO సత్య నారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.