KMR:పెద్ద కొడఫ్గల్ మండలం లింగంపల్లిలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూరి మోహిని(24) శుక్రవారం ఉదయం ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. మృతురాలి తల్లి ఉషాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.