KMR: జిల్లాలోని పల్వంచకు చెందిన బిందు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రోజున హైదరాబాద్లో జూనియర్ సివిల్ జడ్జిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పల్వంచకు చెందిన దళిత యువతి సివిల్ జడ్జి కావడంపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, దళిత సంఘాల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.