మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెం.08 ను మెదక్ ఆర్డీవో రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను ఆమె నిశితంగా పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.