JN: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు విధివిధానాలు, వైర్లెస్ కమ్యూనికేషన్, సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, షీ టీమ్, డయల్ 100, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ జానకిరామ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.