కామారెడ్డి: బాలికలు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండలంలోని బోర్లం మైనారిటీ గురుకుల పాఠశాలను బుధవారం ఉదయం ఆమె సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంటగదిని, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థినులను బాగా చూసుకోవాలని ఆదేశించారు.