KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని నూతన ప్లాట్లలో ఉన్న 11/33 కేవీ విద్యుత్ లైన్ను మార్చి కాలనీవాసుల ప్రాణాలు కాపాడాలని మండల బీజేపీ నాయకుడు తానాజీ రావు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఉన్న ఈ హెవీ విద్యుత్ లైన్ సుమారు పది ఇళ్ల పైనుంచి వెళ్తోందన్నారు. కావున లైన్ మార్చాలని పేర్కన్నారు