NZB: రెంజల్ మండలం నీలా గ్రామంలో సోమవారం రైతులకు సాగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. కూరగాయల సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్ రావు, ఏఈవోలు సాయిలు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.