RR: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఫ్లైఓవర్ పై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని మరో లారీ ఢీకొనడంతో లారీలో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఫ్లైఓవర్ పై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.